దేశవాళీ క్రికెట్లో మార్పులు చేస్తూ BCCI కీలక నిర్ణయం తీసుకుంది. పెనాల్టీ పరుగులకు సంబంధించి నిబంధనల్లో మార్పులు చేసింది. ఎవరైనా బ్యాటర్ బంతిని కొట్టినప్పుడు దాన్ని ఆపే క్రమంలో ఫీల్డింగ్‌కు సంబంధించిన పరికరాలు, వస్తువులను తాకినపుడు.. బ్యాటింగ్ జట్టుకు పెనాల్టీ రూపంలో అదనంగా పరుగులిచ్చేవారు. అయితే ఇకపై ‘పెనాల్టీ’ పరుగులు ఉండవని BCCI స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర క్రికెట్ సంఘాలకు నోట్ పంపింది.