EG: ఏజెన్సీలోని అడ్డతీగలలో ప్రైవేట్ ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్న శ్రీను అనే వ్యక్తి కుమార్తె నవిత(8) ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతూ వైజాగ్ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందినట్లు అతడు తెలిపాడు. నవిత తల్లి దేవి టైఫాయిడ్‌తో 20రోజుల క్రితం మృతి చెందింది. ఒకే కుటుంబంలో రెండు మరణాలు జరగడంతో గ్రామంలో విషాదం నెలకొంది. భార్య, కుమార్తెను కోల్పోయిన శ్రీను కన్నీరు పర్వంతం అయ్యారు.