EG: పి. గన్నవరం మండలం నరేంద్రపురంలో మల్లికార్జునరావు అనే వ్యక్తి ఇంట్లో జరిగిన దొంగతనంపై కేసు నమోదు చేశామని ఎస్సై శివకృష్ణ ఆదివారం తెలిపారు. బాధితుడి కుటుంబం హైదరాబాద్లో ఉంటుందని, ఆదివారం ఇంటి తలుపులు తీసి ఉండటాన్ని గమనించిన స్థానికులు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఇంటిని పరిశీలించగా 425 గ్రాముల వెండి వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించామన్నారు.