TG: కార్పొరేట్ కంపెనీలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ప్రజాభవన్లో నిన్న మంత్రి సీతక్క భేటీ అయ్యారు. CSR నిధులను గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేయాలన్నారు. ప్రతీ సంస్థ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని వాటి అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. కంపెనీలు ‘పే బ్యాక్ టు సొసైటీ’ నినాదంతో తమ సామాజిక బాధ్యత నిర్వర్తించాలని సూచించారు. మారుమూల ప్రాంతాల సమస్యలు, అవసరాలు కంపెనీలకు తెలిసేలా త్వరలో బస్సు యాత్ర చేపడతామన్నారు.