కోనసీమ: నన్ను ఆదరించిన ప్రజలందరికీ రుణపడి ఉన్నానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నిజాంపేట్ సప్తపది గార్డెన్ లో జరిగిన కృతజ్ఞత ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. హైదరాబాదులో వివిధ హోదాల్లో ఉన్న రామచంద్రపురం నియోజకవర్గ ఓటర్లు ఎన్నికల సమయంలో ఎన్నో ప్రయాశలు పడి తనకు అండగా నిలిచారన్నారు.