AP: తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గిపోయింది. కంపార్టుమెంట్లలో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనాన్ని టీటీడీ కల్పిస్తోంది. నిన్న స్వామివారిని 69,333 మంది భక్తులు దర్శించుకోగా.. 22,606 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. కాగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.53 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.