ADB: రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిషన్ ఛైర్మన్ గోపిశెట్టి నిరంజన్, కమిషన్ సభ్యులు ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం రాత్రి జిల్లా కేంద్రానికి చేరుకున్నారు.ఈ సందర్భంగా వారికి స్థానిక పెన్ గంగా గెస్ట్ హౌస్ వద్ద జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ గౌస్ ఆలం పూలమొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించారు.