AP: రాష్ట్రంలో డిసెంబర్ 9న తొలిసారిగా సీప్లేన్ సర్వీసులను ప్రారంభించనున్నట్లు పౌర విమానయాన మంత్రి రామ్మోహన్నాయుడు వెల్లడించారు. ప్రకాశం బ్యారేజీ నుంచి శ్రీశైలం వరకు ట్రయల్ రన్ నిర్వహిస్తామన్నారు. సీప్లేన్ సర్వీసులు అందుబాటులోకి వస్తే అతి తక్కువ ఖర్చులో ఒకేరోజు రాష్ట్రంలోని విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జునస్వామి ఆలయాలు దర్శించుకోవచ్చు.