టాలీవుడ్ హీరోయిన్ రాశీఖన్నా తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ ఈవెంట్లో పాల్గొన్న రాశీ ఈ మధ్య సోషల్ మీడియాలో తన పెళ్లి గురించి తప్పుడు ప్రచారాలు వస్తున్నాయని వెల్లడించింది. అయితే, నాకు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలనే కోరిక ఉంది. కానీ దానికి చాలా సమయముంది అని తెలిపింది. అయినా నా పెళ్లి అనేది నా పర్సనల్ మ్యాటర్ కాబట్టి ఇక్కడ దాని గురించి మాట్లాడం ఇష్టం లేదన్నారు.