సినీ నటుడు కిరణ్ అబ్బవరం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో ఆయనకు టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. “క’ సినిమా ఈ నెల 31వ తేదీ దీపావళి సందర్భంగా విడుదల కానుంది. ప్రతి సినిమా విడుదలకు ముందు స్వామి వారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రేక్షక దేవుళ్లు సినిమాని చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు.