హీరో సూర్య తన కుమారుడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కంగువా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో కుమారుడి తెరంగేట్రం గురించి అడగ్గా.. ‘నేను హీరోగా మారుతానని ఎప్పుడూ అనుకోలేదు. మణిరత్నం సర్ వల్ల సినిమాల్లోకి అడుగుపెట్టా.. దేవ్ చాలా మంచి పిల్లాడు. ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్నాడు. చదువుతోపాటు ఆటల్లో ముందుంటాడు. తాను ఏ రంగాన్ని ఎంచుకున్నా నేను సపోర్ట్ చేస్తా’ అని వెల్లడించారు.