HYD: భారతీయ జనతా పార్టీతోనే ప్రజల సమస్యలు పరిష్కారమౌతాయని కంటోన్మెంట్ బోర్డ్ మెంబర్ జన్యావుల రామకృష్ణ అన్నారు. బస్తీబాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని వార్డ్ 3 మడ్ ఫోర్ట్‌లో స్థానిక నేత బీఎన్ శ్రీనివాస్‌తో కలిసి పర్యటించిన ఆయన స్థానిక ప్రజలతో మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకుని దశలవారీగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.