శ్రీకాకుళం: నరసన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్న సీఆర్ఎంటీ యూనియన్ జిల్లా స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. సీఆర్ఎంటీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, సమ్మె కాలంలో జీతం చెల్లించాలని, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని యూనియన్ జిల్లా అధ్యక్షులు పీటీ నాయుడు డిమాండ్ చేశారు.