AP: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై పీసీసీ చీఫ్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సాయిరెడ్డి చదివింది జగన్ స్క్రిప్ట్ కాదని ప్రమాణం చేయగలరా? ఆస్తుల్లో నలుగురు బిడ్డలకు సమాన వాటా ఉంటుందని YSR అన్నారు. ఆ మాట అబద్ధమని మీ బిడ్డల మీద ప్రమాణం చేయగలరా? మీరు కూడా జగన్ మోచేతి నీళ్లు తాగిన వాళ్లే. YSR మరణానికి ముమ్మాటికి కాంగ్రెస్ కారణం కాదు. బంగారు బాతును ఎవరూ చంపుకోరు’ అని పేర్కొన్నారు.