ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల టేబుల్లో టీమిండియా ఇంకా అగ్రస్థానంలోనే ఉంది. న్యూజిలాండ్‌తో వరుసగా రెండు టెస్టుల్లో ఓడినా రోహిత్ సేన మాత్రం టాప్‌లోనే కొనసాగుతోంది. అయితే రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాకు 62.5 పాయింట్ల శాతం ఉండగా.. భారత్‌కు 62.82 పాయింట్ల శాతం ఉంది. టీమిండియా ఫైనల్ చేరాలంటే ఆస్ట్రేలియా గడ్డపై జరగనున్న 5 టెస్టుల సిరీస్ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.