KDP: మైదుకూరు నియోజకవర్గం స్థానిక చరిత్రను మైదుకూరు పట్టణ రహదారి గోడలపై చిత్రీకరించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి రచయిత, చరిత్ర పరిశోధకులు బొమ్మిశెట్టి రమేష్, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం మాజీ సభ్యుడు డాక్టర్ తవ్వా వెంకటయ్యలు వినతి పత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ.. భక్తి పరమైన ఈ ప్రాంత చరిత్ర విషయాలను హోల్డింగ్స్ ద్వారా తెలపాలని కోరారు.