బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్తో డైరెక్టర్ నిఖిల్ అద్వానీ తెరకెక్కించిన మూవీ ‘ఛాందినీ చౌక్ టు చైనా’. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఘోర పరాజయం అందుకుంది. ఈ చిత్రం విడుదలైన తర్వాత తనకు చేదు అనుభవం ఎదురైనట్లు నిఖిల్ తెలిపారు. ‘ఓ రిపోర్ట్ మా ఇంటి ముందుకు వచ్చాడు. మన డబ్బులు వృథా చేసిన వ్యక్తి ఇల్లు ఇదే. అతన్ని రాళ్లతో కొట్టండి అని రిపోర్ట్ చేశాడు. అతని మాటలు నా మనసును ఎంతో గాయపరిచాయి’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.