గత 12 ఏళ్లగా స్వదేశంలో టీమిండియా 18 వరుస టెస్టు సిరీస్లను గెలిచింది. భారత్ చివరి సారిగా సొంతగడ్డపై 2012లో ఇంగ్లాండ్తో 2-1 తేడాతో పరాజయం పాలైంది. అప్పటి నుంచి ఓటమి చవిచూడలేదు. కానీ.. ప్రస్తుతం న్యూజిలాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో తొలి మ్యాచ్ కోల్పోయిన భారత్.. రెండో మ్యాచ్లోనూ విజయం కోసం పోరాడుతోంది. ఒకవేళ ఈ మ్యాచ్లో భారత్ ఓడిపోతే 18 వరుస టెస్ట్ సిరీస్ల విజయాలకు బ్రేక్ పడనుంది.