AP: తాను 1995 నాటి సీఎంనే కానీ 2014 అప్పటి సీఎంను కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ‘ఈసారి కచ్చితంగా రాజకీయ పరిపాలనే చేస్తాను. రాజకీయ ముసుగులో తప్పు చేసిన వారిని వదిలిపెట్టేది లేదు. జగన్ విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం. రూ.10 లక్షల కోట్లకు పైగా అప్పుల భారం మోస్తున్నాం. ఈ విష వలయం నుంచి బయటపడేందుకు కొంత సమయం అవసరం’ అని తెలిపారు.