NDL: బనగానపల్లెలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం 2024-26 తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ రూ.లక్షతో TDP శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు. పార్టీ సభ్యత్వం పొందిన కార్యకర్తలకు రూ.5 లక్షల బీమా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు మరింతగా ముందుకు రావాలన్నారు.