NDL: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ఉచిత ఇసుక హామీని CM చంద్రబాబు నాయుడు అమలు చేశారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా బనగానపల్లెలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం TDP శ్రేణులతో కలిసి CM చంద్రబాబు చిత్రపటానికి మంత్రి బీసీ పాలాభిషేకం చేశారు.