టీడీపీ కొత్త కార్యక్రమానికి నాంది పలికింది. నేటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టనుంది. ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఈ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రూ.100 సభ్యత్వంతో కార్యకర్తలకు రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా, వారి కుటుంబ సభ్యులకు విద్య, వైద్యం, ఉపాధి కోసం సాయం అందించనున్నారు. రికార్డు స్థాయిలో సభ్యత్వాలు జరిగేలా పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.