నెల్లూరు నూరిన్కు కావలి షాదాబ్తో గతేడాది వివాహం జరిగింది. కట్నకానుకల కింద రూ.2 లక్షలు, 12 సవర్ల బంగారం, కేజీ వెండి వస్తువులు ఇచ్చారు. వివాహమైన నాలుగు నెలల నుంచే భర్త, అత్తింటివారు అదనపు కట్నం కోసం నూరిన్ను వేధించడం ప్రారంభించారు. వ్యసనాలకు బానిసైన షాదాబ్.. భార్య పేరుపై ఉన్న క్రెడిట్ కార్డు, బ్యాంకు ఖాతాల నుంచి రూ.5లక్షలు వాడుకున్నాడు.