MDK: జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు బీరప్ప బస్తిలో, 9వ వార్డు కెబిఆర్ కాలనీలలో రూ.50 లక్షల మున్సిపాలిటీ నిధులతో సీసీ రోడ్డు పనులను శుక్రవారం బొల్లారం మున్సిపల్ ఛైర్పర్సన్ కొలన్ రోజా బాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ బీరప్ప యాదవ్, ఏఈ కిష్టయ్య, ప్రశాంత్, శ్రీనివాస్ రెడ్డి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.