సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలా కష్టం మీద సినీ ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చిందని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇండస్ట్రీకి మార్కెట్ ఉందని పేర్కొన్నారు. ఇప్పుడు ఇండస్ట్రీకి రావాలని కోరుకోవడం కాదు.. లోకల్‌గా కంటెంట్‌ను డెవలప్ చేసుకోవాలన్నారు. సోషల్ మీడియా, ఓటీటీ యుగంలో ఎవరికి వారే కంటెంట్ క్రియేటర్లుగా మారారని సూచించారు.