JGL: మల్లాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలసి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.