GNTR: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పూర్తయ్యే వరకు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లను నిలుపుదల చేయాలని MRPS అధినేత మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. గుంటూరు పట్టణంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆగస్టు 1న ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన సానుకూల తీర్పుకు అనుగుణంగా జాబ్స్ నోటిఫికేషన్స్ నిలుపుదల చేయాలని కోరారు.