TG: కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణకు మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు హాజరయ్యారు. 2019 నుంచే బ్యారేజీల దగ్గర సమస్యలు వచ్చాయని, కాళేశ్వరం కమిషన్కు వెంకటేశ్వర్లు తెలిపారు. అలాగే, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ ఖర్చులపై ఆరా తీయగా.. ప్రాజెక్టు పూర్తయ్యేనాటికి ఖర్చు రెట్టింపు అయ్యిందన్నారు. కాస్ట్ పెరుగుటకు నిర్మాణ సంస్థలు కూడా కారణమని, ప్రాజెక్టు డిజైన్స్, అదనపు పనుల వల్ల ఖర్చు పెరిగినట్లు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.