ఆస్ట్రేలియా దేశవాలి వన్డే కప్లో క్రికెట్ అభిమానులను షాక్కు గురిచేసే ప్రదర్శన చోటుచేసుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు టాస్మానియా జట్టు చుక్కులు చూపించింది. 51/2తో కొనసాగుతున్న సమయంలో కేవలం 2 పరుగులు కొట్టేలోపే 8 వికెట్లు పడగొట్టి ఆలౌట్ చేసింది. అనంతరం 53 పరుగుల లక్ష్యాన్ని టాస్మానియా 3 వికెట్లు కోల్పోయి 8.3 ఓవర్లలో విజయం సాధించింది.