TG: అన్ని అనుమతులు ఉన్న బిల్డింగులను హైడ్రా కూల్చదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నెలకు ఒకసారైనా బాధితులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ORR నిర్మించిందన్న మంత్రి.. ఇప్పుడు RRR నిర్మిస్తోందని పేర్కొన్నారు. యుద్ధ ప్రాతిపదికన మెట్రో విస్తరణ చేస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయిలో నిలపడం తమ లక్ష్యం అని స్పష్టం చేశారు.