SKLM: బూర్జ మండలం పెద్దపేట సచివాలయం పరిధిలో పెద్ద పేటలో భూరీ సర్వే గ్రామ సభను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా భూముల రీసర్వేపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. బూర్జ రెవెన్యూ పరిధిలో ఉన్న వివిధ భూముల రీసర్వే సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తాహసిల్దార్ పద్మావతి, ఏపీ మార్కెట్ ఫెడ్ డైరెక్టర్ అనెపు రామకృష్ణ, గ్రామస్తులు పాల్గొన్నారు.