అమెరికాలోని ఖలిస్తానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి హెచ్చరికలు జారీ చేశాడు. భారత్లోని CRPF స్కూళ్లను మూసివేయాలని హెచ్చరించాడు. కేంద్రమంత్రి అమిత్ షా విదేశీ పర్యటనల సమాచారం ముందస్తుగా ఇచ్చినవారికి మిలియన్ డాలర్లు బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు. పంజాబ్, విదేశాల్లోని సిక్కులపై దాడులు చేశారని తెలిపాడు. విద్యార్థులు, తల్లిదండ్రులు CRPF స్కూళ్లను బహిష్కరించాలని ఓ ప్రకటన విడుదల చేశాడు.