NRML: దిలావర్పూర్ మండల కేంద్రంలో గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో డ్రైడే ఫ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన కాలనీలలో డ్రైడే కార్యక్రమంపై అవగాహన కల్పించారు. నీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని సిహెచ్ఓ రాజేశ్వర్ అన్నారు. లేదంటే దోమల వృద్ధి చెంది అనారోగ్యాలకు కారణం అవుతాయని తెలిపారు.