AP: నెల్లూరు జిల్లా సైదాపురం మండలం రామసాగరంలో నిర్వహిస్తున్న అక్రమ మైనింగ్‌పై పోలీసులు దాడులు జరిపారు. అక్రమ మైనింగ్‌పై రెవెన్యూ, పోలీసు అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. రెండు టిప్పర్లు, హిటాచీ, జేసీబీ సీజ్ చేసి 12 మందిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. రామసాగరం ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు గుర్తించారు.