TG: అధికారం కోల్పోయామనే దుర్భుద్దితో మాజీమంత్రి కేటీఆర్ దూషణలకు దిగితే సహించేది లేదని మంత్రి సీతక్క హెచ్చరించారు. ఆదిలాబాద్‌లోని రామ్‌లీలా మైదానంలో సీఎం రేవంత్‌పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. తగిన రీతిలో వారికి సమాధానం చెప్పాల్సి వస్తుందని అన్నారు. పదేండ్లు మంత్రిగా వెలగబెట్టిన కేటీఆర్.. ఇప్పుడు సభ్యతా, సంస్కారాలు మరచి సీఎం కుర్చీని అవమాన పరిచేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.