AP: పల్నాడు జిల్లా దాచేపల్లిలో అతిసారం ప్రభావిత కాలనీలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పర్యటించారు. పల్నాడు జిల్లా కలెక్టర్‌తో కలిసి యరపతినేని పరిశీలించారు. కలుషిత నీటి వల్లే స్థానికులకు వాంతులు, విరేచనాలని గుర్తించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే డ్రేనేజీ, పారిశుద్ధ్య సమస్యలు వచ్చాయన్నారు. సురక్షిత నీటి కోసం రూ. 25 లక్షలతో శాండ్ ఫిల్టర్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.