NLR: పొగాకు ఉత్పత్తులను వినియోగించడం ద్వారా ఆరోగ్యం క్షీణిస్తుందని సీతారామపురం జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులు సూచించారు. సీతారామపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో పొగాకు వినియోగించడం వలన కలిగే అనర్ధాలను వివరించే పోస్టర్ని గురువారం పాఠశాలలో ప్రదర్శించారు. పొగాకు ఉత్పత్తుల జోలికి పోవద్దని విద్యార్థులకు అవగాహన కల్పించారు.