ఈటీవీలో ఆదివారం ప్రసారమయ్యే ‘నా ఉఛ్వాసం కవనం’ ఇంటర్వ్యూకు రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా దివంగత గేయ రచయిత సిరివెన్నెలతో అనుబంధాన్ని పంచుకున్నాడు. వర్షం సినిమాలో ‘మెల్లగా కరగని’ పాట వినగానే షాక్ అయ్యానని.. ఈ సాంగ్ ఏదో తేడాగా ఉందని అనుకున్నానని.. కానీ తర్వాత నా ఫేవరెట్ సాంగ్ అయిందని వివరించాడు. వర్షం సినిమాతోనే తనకు లిరిక్స్‌పై లవ్ ప్రారంభమైందన్నాడు.