TG: BJP ఎప్పుడూ పేదల పక్షానే ఉంటుందని ఎంపీ ఈటల అన్నారు. మూసీ పునరుజ్జీవనం కోసం ఇళ్లు కూల్చడం ఎందుకు? అని ప్రశ్నించారు. డీపీఆర్ లేకుండా అప్పుడే మార్కింగ్ ఎలా చేస్తారని విమర్శించారు. గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరిట క్రమబద్ధీకరణ చేసిందని.. బీఆర్ఎస్ స్థిరాస్తి వ్యాపారులు ఇళ్లను పేదవారికి విక్రయించారని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు ఆ పార్టీ నేతలే మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు.