ప్రకాశం: కనిగిరి పట్టణంలో గురువారం పాన్ ఇండియా కార్యక్రమాన్ని కార్మిక శాఖ, రెవిన్యూ, పోలీస్ శాఖలతో పాటు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు చేపట్టారు. పట్టణంలోని వ్యాపార సంస్థలను, మెకానిక్ షాపులను పరిశీలించారు. 14 సంవత్సరాల లోపు చిన్నారులను పనులలో పెట్టుకోరాదని తెలిపారు. కార్మికశాఖ నిబంధనలు ఉల్లంగించినట్లయితే చర్యలు తప్పవని కార్మికశాఖ అధికారి సుబ్బరాయుడు హెచ్చరించారు.