AP: ఇప్పటికే డయేరియా కేసులు కొన్ని బయటకు వచ్చాయని హోంమంత్రి అనిత తెలిపారు. గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం పారిశుద్ధ్యాన్ని పట్టించుకోలేదని పేర్కొన్నారు. జగన్ చేసిన తప్పులను తమపై నెడుతున్నారని.. అమ్మాయిల అత్యాచారాలు, హత్యలపై వైసీపీ తప్పుడు ప్రచారం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఇలాగే మాట్లాడితే 11 సీట్లు కూడా దక్కవన్నారు. గుర్లలో డయేరియా సమస్యపై ప్రభుత్వం వెంటనే స్పందించిందని తెలిపారు.