TG: తెలంగాణ ఉద్యోగ జేఏసీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. అనంతరం ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం మా సమస్యలను పరిష్కరిస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు. బదిలీలు, సర్వీసు అంశాలను పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారని వెల్లడించారు. డిప్యూటీ సీఎంతో చర్చించి ప్రకటన చేస్తామని సీఎం అన్నారని, ఆర్థిక సంబంధ అంశాలపై విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారని పేర్కొన్నారు.