JN: పాలకుర్తి మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని SFI జనగామ జిల్లా ఉపాధ్యక్షురాలు దాసగాని సుమ MLA యశస్విని రెడ్డికి వినతి పత్రం అందజేసారు. ఆమె మాట్లాడుతూ.. మండలంలో పేద, మధ్య తరగతికి చెందిన విద్యార్థులు ఉన్నారని, ప్రైవేటు విద్యా సంస్థలకు ఫీజులు చెల్లించలేక విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే ఏర్పాటు చేయాలని కోరారు.