మహారాష్ట్రలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బారామతి నియోజకవర్గం నుంచి అజిత్ పవార్ పోటీకి సిద్ధమవ్వగా.. ప్రత్యర్థిగా శరద్ పవార్ వర్గం నుంచి యుగేంద్ర పవార్ బరిలో దిగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల లోక్సభ ఎన్నికల్లోనూ బారామతిలో అజిత్ భార్య సునేత్రపై శరద్ పవార్ కుమార్తె సుప్రియా గెలిచారు. కాగా మరోసారి ప‘వార్’కు బారామతి అసెంబ్లీ వేదిక కానుంది.