BDK: కొత్తగూడెం పట్టణానికి చెందిన రెజ్లింగ్ క్రీడాకారుడు సిద్ధార్థ నీట్ ఫలితాల్లో మెడిసిన్ సీటు సాధించారు. రెజ్లింగ్ పోటీల్లో ఎన్నో పతకాలు గెలుపొందిన సిద్ధార్థ డాక్టర్ కావాలన్న కోరికతో సీటు సాధించడం జరిగిందన్నారు. గురువారం జిల్లా క్రీడాధికారి పరంధామ రెడ్డి, జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కాశీ హుస్సేన్ సిద్ధార్థను అభినందించారు.