కృష్ణ: అల్లూరు మండలంలోని శ్రీ కామాక్షి సమేత సిద్దేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారికి చెందిన బంగారు, వెండి నగలు అపహరణకు గురయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ కిశోర్ బాబు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఆలయ ఈవో చిట్టిబాబు మాట్లాడుతూ.. అమ్మవారి మెడలో ఉన్న మూడున్నర గ్రాముల బంగారు తాళిబొట్టుతో పాటు వెండి ఆభరణాలు దుండగులు అపహరించినట్లు గుర్తించామన్నారు.