కస్టర్డ్ ఆపిల్, షుగర్ ఆపిల్ అని పిలిచే సీతాఫలం ఈ సీజన్లో విరివిగా లభిస్తుంది. ఈ పండు రుచిలో మేటి. దీనితో ఆరోగ్య ప్రయోజనాలు కూడా మెండుగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. సీతాఫలంలో పుష్కలంగా ఉండే పోషకాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి. ఈ పండుతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. చర్మం యవ్వనంగా, మృదువుగా మారుతుంది. కళ్లు ఆరోగ్యంగా ఉండి, దృష్టి మెరుగుపడుతుంది.