TG: BRS వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి KTR ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. రుణమాఫీ, రైతుభరోసాపై జిల్లా కేంద్రంలోని రామ్లీలా మైదానంలో బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభలో రైతులు, ఉమ్మడి జిల్లా పార్టీ శ్రేణులు పాల్గొననున్నారు. రైతాంగ సమస్యల పరిష్కారానికి రాష్ట్రంలోని ఆదిలాబాద్ నుంచే శంఖారావం పూరించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తొలి సమావేశం కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.