ఐసీసీ తాజాగా టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్లో భారత బ్యాటర్ రిషబ్ పంత్.. విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టి ఆరోస్థానంలో నిలిచాడు. టాప్ టెన్ టెస్ట్ బ్యాటర్ల జాబితాలో టీమిండియా నుండి యశస్వి జైస్వాల్(4), రిషబ్ పంత్(6), విరాట్ కోహ్లీ(8) స్థానంలో నిలిచారు. కాగా ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జో రూట్ ఈ జాబితాలో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు.