AP: శారదా పీఠం భూకేటాయింపుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. రూ.20 కోట్లు ధరపలికే భూమిని రూ.లక్షకు అప్పగించారని తెలిపారు. సాంస్కృతిక కళాశాల ఏర్పాటుతో భూములు తీసుకున్నారని అన్నారు. శారదా పీఠానికి భూముల మళ్లింపును గుర్తించి రద్దు చేశామని పేర్కొన్నారు. అలాగే ఎర్రమట్టి దిబ్బల తవ్వకాల్లో జరిగిన అక్రమాలపై విచారణ చేస్తామని మంత్రి అనగాని వ్యాఖ్యానించారు.